Pawan Kalyan: గన్నవరం చేరుకున్న పవన్ కల్యాణ్‌

  • హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన పవన్‌
  • అమరావతిలో రెండు రోజుల పర్యటన
  • ఈనెల 26 నుంచి విశాఖ జిల్లాలో..
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి కృష్ణా జిల్లా గన్నవరం చేరుకున్నారు. అమరావతిలో పవన్‌ కల్యాణ్‌ రెండు రోజులు పర్యటిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వస్తారు. విశాఖపట్నం జిల్లాలో జనసేన పోరాట యాత్రను ఈ నెల 26 నుంచి తిరిగి ప్రారంభిస్తోన్న విషయం తెలిసిందే.

ఈ మలివిడత జన పోరాట యాత్ర ఆ జిల్లాలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. అలాగే, పవన్‌ ఉత్తరాంధ్ర మేధావులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. అనంతరం ఆయన తూర్పు గోదావరి జిల్లాలోనూ పర్యటించనున్నారు.
Pawan Kalyan
Jana Sena
Krishna District

More Telugu News