Chandrababu: ‘నాతో విడిగా మాట్లాడు’ అని చంద్రబాబు చెప్పారు: మంత్రి గంటా

  • అలకబూని ఆపై మెత్తబడ్డ గంటా 
  • విందుకు ఆహ్వానించిన చంద్రబాబు
  • అన్నీ బాబుకి వివరించానన్న గంటా
తన సొంత నియోజకవర్గంలోని ప్రజల నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటున్నారంటూ వచ్చిన సర్వే వార్తలతో మనస్తాపానికి గురైన మంత్రి గంటా శ్రీనివాసరావు ఎట్టకేలకు పార్టీ నేతల బుజ్జగింపులతో మెత్తబడిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు సూచనల మేరకు వారు రాయబారం నడిపారు.

విశాఖపట్టణంలో హెల్త్ ఫెస్టివల్ సమావేశంలో భాగంగా గంటాను చంద్రబాబు పిలిపించారు. విందుకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారి మధ్య చర్చ జరిగింది. గంటా అలకబూనడానికి గల కారణాలపై చంద్రబాబు ఆరా తీసినట్టు సమాచారం.

విందు అనంతరం, విలేకరులతో గంటా మాట్లాడుతూ, కొన్ని రోజులుగా జరిగిన పరిణామాలను చంద్రబాబుకు వివరించానని, తన సమస్యలన్నీ విన్న బాబు, తనతో విడిగా మాట్లాడమని చెప్పారని అన్నారు.
Chandrababu
Ganta Srinivasa Rao

More Telugu News