Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షం

  • కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో వర్షం
  • పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
  • కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం
ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పాఠశాలలకు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఉన్నట్లుండి పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెద్దకొండూరులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. మరోవైపు మంగళగిరిలోనూ, కృష్ణా జిల్లా మైలవరంలో ఓ మోస్తరు వర్షం పడుతోంది. విశాఖపట్నం జిల్లా పాడేరులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.  
Andhra Pradesh
rain

More Telugu News