Telugudesam: కేంద్ర నిధులన్నీ చంద్రబాబు దుర్వినియోగం చేశారు: కన్నా లక్ష్మీనారాయణ
- శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ
- అడిగిన దానికంటే ఎక్కువే కేంద్రం నిధులు ఇచ్చింది
- ఎన్నికల సమయం దగ్గర పడటంతో తప్పులన్నీ బీజేపీపై, కేంద్రంపై నెట్టేస్తున్నారు
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై పలు విమర్శలు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసిందని అన్నారు. అడిగిన దానికంటే కేంద్రం ఎక్కువే ఇచ్చిందని, ఇదే విషయాన్ని స్వయంగా చంద్రబాబు గతంలో చెప్పారని తెలిపారు. తీరా ఇప్పుడు కేంద్రం ఏమీ ఇవ్వలేదని మాట ఫిరాయిస్తున్నారని ఆరోపించారు.
ప్రత్యేక ప్యాకేజీ కింద ఇచ్చిన రూ.16వేల కోట్లు తీసుకోవడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయకుండా, కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర నిధులను దుర్వినియోగం చేసి ఎన్నికల సమయం దగ్గరవ్వడంతో తప్పులన్నీ బీజేపీపై, కేంద్రంపై నెట్టేసి మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. చంద్రబాబు 2014లో మోసపూరిత హామీలిచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదని మండిపడ్డారు.