చిరూ చిన్నల్లుడి మూవీ నుంచి వెరైటీ పోస్టర్ .. రేపు చికెన్ సాంగ్ రిలీజ్
- కల్యాణ్ దేవ్ హీరోగా 'విజేత'
- కథానాయికగా మాళవిక నాయర్
- ఈ నెల 24వ తేదీన ఆడియో రిలీజ్
ఆ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ చాలా వెరైటీగా వుంది. చికెన్ షాప్ దగ్గర నుంచుని అలా మారిపోయిన కోడిని తలచుకుని ఏడుస్తూ ఈ పోస్టర్ లో కల్యాణ్ దేవ్ కనిపిస్తున్నాడు. చూస్తుంటే .. మాస్ ఆడియన్స్ ను అలరించడం కోసం 'కోడి' మీద మాంచి మసాలా సాంగ్ పెట్టినట్టుగానే కనిపిస్తోంది. ఈ నెల 24వ తేదీన ఆడియో వేడుకను ఘనంగా జరపనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.