Vijayawada: రేపు విజయవాడ దుర్గ గుడిలో సామూహిక అక్షరాభ్యాసాలు!

  • రేపు అమ్మవారి జన్మ నక్షత్రం మూల
  • ఉదయం పది గంటలకు అక్షరాభ్యాస కార్యక్రమం
  • ఈ అవకాశాన్ని చిన్నారుల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలి: ఈవో పద్మ
ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో విజయవాడ దుర్గగుడిలో ఉచితంగా సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించడం ఆనవాయతీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నామని దుర్గ గుడి ఈవో ఎం.పద్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, రేపు అమ్మవారి జన్మ నక్షత్రం మూల అని, ఉదయం పది గంటలకు అక్షరాభ్యాస కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు.

చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించదలచుకున్న తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారి పేర్లను www. kanakadurgamma.org వెబ్ సైట్ లో లేదా ఆలయ ప్రాంగణంలోని కార్యాలయంలో నమోదు చేసుకోవాలని తెలిపారు. అక్షరాభ్యాస కార్యక్రమానికి అవసరమైన సామాగ్రిని దేవస్థానం తరపున ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు.
Vijayawada
kanaka durga temple

More Telugu News