akhilapriya: కాబోయే భర్తతో కలిసి నారా లోకేష్ ఆశీస్సులు తీసుకున్న అఖిలప్రియ

  • లోకేష్ ను కలిసిన అఖిలప్రియ, భార్గవ్
  • పెళ్లిపీటలు ఎక్కబోతున్న జంటకు శుభాకాంక్షలు తెలిపిన లోకేష్
  • అన్నా.. మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు అన్న అఖిలప్రియ
ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రేమ వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాదులో వీరి నిశ్చితార్థం ఇటీవలే జరిగింది. ఆగస్ట్ 29న వీరి వివాహం జరగబోతోంది. ఈ నేపథ్యంలో అఖిలప్రియ, భార్గవ్ లు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా వీరిద్దరికీ లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని అఖిలప్రియ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'అన్నా, మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మీతో సమయాన్ని గడపడం గౌరవంగా భావిస్తున్నాం' అంటూ ట్వీట్ చేశారు. దీనికి 'బిగ్ బ్రదర్' అంటూ హ్యాష్ ట్యాగ్ ను జతచేశారు.
akhilapriya
bhargav
Nara Lokesh
marriage

More Telugu News