ap: 29న ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన వైసీపీ

  • కడప ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకునేందుకు వైసీపీ పోరాటం
  • రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపు
  • కడప ఉక్కు రాష్ట్ర హక్కు అన్న వైసీపీ
కడప ఉక్కు పరిశ్రమను సాధించుకునే క్రమంలో వైసీీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. కడప ఉక్కు రాష్ట్ర హక్కు అని... ఉక్కు పరిశ్రమను సాధించుకునేందుకే బంద్ కు పిలుపునిచ్చామని వైసీపీ ప్రకటించింది.

మరోవైపు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఉక్కు పరిశ్రమను సాధించడం కోసం కడప జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే దీక్ష చేపట్టిన కడప జిల్లాకు చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఆ పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రాజీనామాలకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. ఉక్కు పరిశ్రమ కోసం రాచమల్లు చేపట్టిన 48 గంటల దీక్ష పూర్తయింది. ప్రొద్దుటూరులో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనచేత దీక్షను విరమింపజేశారు.
ap
Andhra Pradesh
bandh
ysrcp

More Telugu News