Uttar Pradesh: ఒకరిని చూపించి మరొకరితో పెళ్లి... పెళ్లిమండపంపై ససేమిరా అన్న వధువు!

  • యూపీలోని మైన్ పురిలో ఘటన
  • మరో యువకుడిని తెచ్చారని గుర్తించిన వధువు
  • దండలు మార్చుకునే సమయంలో చూసి పెళ్లి వద్దని మొరాయింపు
  • రద్దయిన పెళ్లి
పెళ్లి చూపుల సమయంలో తనకు చూపించిన యువకుడు, కల్యాణ మండపం పైకి వచ్చిన యువకుడు ఒకరు కాదంటూ, ఓ వధువు దండలు మార్చుకునే సమయంలో షాకిచ్చింది. ఉత్తర ప్రదేశ్ లోని మైన్ పురిలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, ఔఛా ప్రాంతానికి చెందిన రాజేష్ గుప్తా కుమారుడు అభిషేక్ గుప్తాకు, ఫిరోజాబాద్ కు చెందిన రాజ్ కుమార్ గుప్తా కుమార్తె తృప్తీ గుప్తాతో వివాహం నిశ్చయమైంది. ఔఛాలో ఈ పెళ్లిని ఘనంగా చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు.

వధూవరులిద్దరినీ మండపంపైకి తీసుకు వచ్చి మరికాసేపట్లో వారికి వివాహం జరుగుతుందనగా, దండలు మార్చుకునే సమయంలో పెళ్లి కుమార్తెకు అనుమానం వచ్చింది. తనకు ఈ పెళ్లి వద్దని, తనను మోసం చేస్తున్నారని ఆరోపించింది. ఆమె తల్లిదండ్రులతో పాటు వరుడి తల్లిదండ్రులు నచ్చజెప్పాలని చూసినా వినలేదు. బలవంతంగా పెళ్లి చేస్తే చనిపోతానే తప్ప, కాపురం మాత్రం చేయలేనని మొండికేసింది. పెళ్లి చూపుల్లో చూసిన యువకుడు ఇతను కాదని చెప్పింది. ఇక చేసేదేమీ లేక వివాహాన్ని రద్దు చేసుకుని, వరుడిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు మగపెళ్లివారు.
Uttar Pradesh
Marriage
Minepuri
Marriage Cancel

More Telugu News