Rahul Gandhi: రాహుల్ గాంధీతో తమిళనాడు రాజకీయాలపై చర్చించాను: కమలహాసన్‌

  • ఢిల్లీలో పలువురు నేతలతో భేటీ
  • తమిళనాడులో కొత్తగా ఏర్పాటైన కమల్‌ పార్టీ
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియపై డిప్యూటీ ఎన్నికల కమిషనర్ తో చర్చ
తమిళనాడు మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అక్కడ పలువురు నేతలతో భేటీ అవుతూ రాజకీయ అంశాలపై చర్చలు జరుపుతున్నారు. తన పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిసి, చర్చించారు. ఈ భేటీ ముగిసిన తరువాత కమల హాసన్ మీడియాతో మాట్లాడారు. తాను రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశానని, తామిద్దరం తమిళనాడు రాజకీయాలపై చర్చించామని తెలిపారు. కాగా, తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కమల్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ చంద్రభూషణ్‌ను కూడా కలిశారు. తమిళనాడులో కొత్తగా ఏర్పాటైన తమ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ఆయన చర్చించారు.      
Rahul Gandhi
Kamal Haasan
New Delhi

More Telugu News