steel factory: ఉక్కు ఫ్యాక్టరీ కోసం చేస్తున్న దీక్షను ఉద్యమంగా మారుస్తాం: మంత్రి ఆదినారాయణరెడ్డి

  • ఉక్కు ఫ్యాక్టరీ విషయమై కేంద్రం కాలయాపన చేసింది
  • అందుకే, సీఎం రమేష్ దీక్ష చేపట్టారు
  • ఈ దీక్షపై బీజేపీ నేతల విమర్శలు తగదు
కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం చేస్తున్న దీక్షకు ప్రజల మద్దతు ఉందని, దీనిని ఉద్యమంగా మారుస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి హెచ్చరించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉక్కు ఫ్యాక్టరీ విషయమై కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేసిందని, ఈ వైఖరికి నిరసనగానే సీఎం రమేష్ దీక్ష చేపట్టారని చెప్పారు. ఈ దీక్షను పబ్లిక్ స్టంట్ గా బీజేపీ నేతలు అభివర్ణించడం తగదని, ఉక్కు పరిశ్రమకు ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించాలని, అప్పుడే తమ దీక్ష విరమిస్తామని చెప్పారు. 
steel factory
adinarayana reddy

More Telugu News