Botsa Satyanarayana: మా పార్టీలోకి ఎవరు వచ్చినా వారు తమ పదవులకు రాజీనామా చేసి రావాలి: బొత్స

  • విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన బొత్స
  • మంత్రి గంటా మా పార్టీలోకి వస్తున్నారో లేదో నాకు తెలియదు
  • పార్టీ విధానాలు నచ్చి ఎవరైనా వస్తే ఆహ్వానిస్తాం
ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య విభేదాలు ఉన్నాయని, మరోవైపు సర్వే పేరుతో తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గంటా శ్రీనివాసరావు మనస్తాపం చెందారని వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణను మీడియా ఓ ప్రశ్న అడిగింది.

గంటా శ్రీనివాసరావు మీ పార్టీలోకి రానున్నారా? అంటూ అడిగిన ప్రశ్నకు బొత్స స్పందిస్తూ... ఆ విషయం తనకు తెలియదని అన్నారు. పార్టీ విధానాలు నచ్చి ఎవరైనా వస్తే ఆహ్వానిస్తామని, అయితే, తమ పార్టీలోకి ఎవరు వచ్చినా వారు తమ పదవులకు రాజీనామా చేసి రావాలని వ్యాఖ్యానించారు.       
Botsa Satyanarayana
YSRCP
Ganta Srinivasa Rao

More Telugu News