Kajal Agarwal: కాజల్ తో దిగిన ఫొటో పోస్ట్ చేసి.. 'జస్ట్ డూ కుమ్ముడు' అంటూ ట్యాగ్ లైన్ పెట్టిన దేవిశ్రీ ప్రసాద్!

  • కాజల్ కు 33 ఏళ్లు నిండాయి 
  • వెరైటీగా శుభాకాంక్షలు చెప్పిన దేవిశ్రీ ప్రసాద్
  • వైరల్ అవుతున్న ఫొటో
తన అందం, అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకులకు చేరువైన హీరోయిన్ కాజల్ అగర్వాల్, నిన్నటితో 33 సంవత్సరాల వయసును పూర్తి చేసుకుని 34వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఆమెకు వెరైటీగా శుభాకాంక్షలు చెప్పాడు.

గతంలో కాజల్ తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ, "హే సూపర్ హ్యాపీ మ్యూజికల్, బర్త్ డే టూ యూ డియర్ కాజల్... అమ్మడు... జస్ట్ డూ కుమ్ముడు" అని ట్యాగ్ చేశాడు. ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. కాజల్ కు పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
Kajal Agarwal
Devisri Prasad
Birthday
Social Media

More Telugu News