Chandrababu: నాయీ బ్రాహ్మణులకు చంద్రబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలి: సోము వీర్రాజు డిమాండ్

  • నాయీబ్రాహ్మణుల పట్ల బాబు వ్యవహరించిన తీరు పద్ధతిగా లేదు
  • కేంద్ర పథకాలు సీఎంకు, టీడీపీకి ‘ఉపాధి హామీ’ అయ్యాయి
  •  చంద్రబాబు లక్షల కోట్ల అవినీతి చేశారు
నాయీ బ్రాహ్మణులకు సీఎం చంద్రబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్న నాయీబ్రాహ్మణుల పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు పద్ధతిగా లేదని మండిపడ్డారు. కేంద్ర పథకాలు సీఎంకు, టీడీపీకి ఉపాధి హామీ పథకంగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లక్షల కోట్ల  అవినీతి చేశారని, విశాఖలో ఈఎస్ఐకి స్థలం కేటాయించలేదని, ఇప్పుడేమో, విశాఖ నుంచి ఈఎస్ఐని విజయవాడకు తరలించాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
Chandrababu
somu veeraj

More Telugu News