కంటెయినర్ స్కానర్ వల్ల మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు: కృష్ణపట్నం పోర్టు సీఈవో అనిల్ యెండ్లూరి
- అత్యున్నత సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందున్నాం
- కంటెయినర్ స్కానర్ తో మెరుగైన సేవలు
- దేశానికి కూడా మరింత ఆదాయం
ఈ సందర్భంగా కేపీసీఎల్ సీఈవో అనిల్ యెండ్లూరి మాట్లాడుతూ, అత్యున్నత సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో కృష్ణపట్నం పోర్టు ముందంజలో ఉందని తెలిపారు. తమ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి కంటెయినర్ స్కానర్ ఉపయోగపడుతుందని చెప్పారు. సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా పోర్ట్ కార్యకలాపాలు మెరుగుపడటమే కాకుండా, దేశానికి మరింత ఆదాయం చేకూరుతుందని తెలిపారు.