Andhra Pradesh: ఏపీ మంత్రివర్గం భేటీ.. కీలక అంశాలపై చర్చ

  • సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన భేటీ
  • పరిశ్రమలకు భూకేటాయింపులు, అగ్రిగోల్డ్ అంశాలపై చర్చ
  • నిరుద్యోగ భృతి విధి విధానాల ఖరారుపై నిర్ణయం తీసుకునే అవకాశం
  • నీతి ఆయోగ్ సమావేశం అంశాలపై చర్చ
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరుగుతోంది. ఇందులో ప్రధానంగా ఏపీలో పరిశ్రమలకు భూకేటాయింపులు, అగ్రిగోల్డ్ అంశం, త్వరలో అమలు చేయనున్న నిరుద్యోగ భృతి విధి విధానాల ఖరారుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశం అంశాలను మంత్రులకు చంద్రబాబు వివరించే అవకాశం ఉంది. విభజన హక్కుల సాధన నిరసన కార్యక్రమాలపై సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలపై కూడా మంత్రులతో చంద్రబాబు చర్చిస్తున్నట్లు సమాచారం.   
Andhra Pradesh
cabinet

More Telugu News