sudhindra kulkarni: మోదీ ఫెయిలయ్యారు.. కశ్మీర్, చైనా వంటి సమస్యలను పరిష్కరించే సత్తా రాహుల్ కే ఉంది: బీజేపీ మాజీ సలహాదారు

  • రాహుల్ యువకుడు, ఆదర్శవాది, కరుణ కలిగిన నేత
  • భావి ప్రధాని రాహుల్ గాంధీనే
  • మోదీ, ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయి
కశ్మీర్ లాంటి కీలక సమస్యలను పరిష్కరించగలిగే సత్తా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని బీజేపీ మాజీ సలహాదారుడు, ఎల్కే అద్వానీకి అత్యంత సన్నిహితుడు అయిన సుధీంద్ర కులకర్ణి అన్నారు. భావి ప్రధానిగా రాహుల్ గాంధీని ఆయన అభివర్ణించారు. పాకిస్థాన్, చైనాలతో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రధాని మోదీ, అతని ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. రాహుల్ గాంధీ మంచి నాయకుడే కాకుండా, మంచి మనిషి అని కితాబిచ్చారు. ముంబైలో ఓ ప్యానెల్ డిస్కషన్ లో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు అభిప్రాయాలను వెల్లడించారు.

పొరుగుదేశాలతో సంబంధాలను పూర్వ స్థితికి తీసుకురావడం వల్ల భారత్ గొప్ప దేశంగా ఎదుగుతుందని కులకర్ణి అన్నారు. రాహుల్ గాంధీ యువకుడని, ఆదర్శభావాలు, కరుణ కలిగిన వ్యక్తి అని చెప్పారు. ఈ సందర్భంగా రాహుల్ కు ఆయన ఒక సలహా ఇచ్చారు. పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్ లలో పర్యటించాలని... కీలక సమస్యల పరిష్కారానికి అవసరమైన మార్గాలను అన్వేషించాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ కూడా ఇలాగే చేశారని... ఆఫ్ఘనిస్థాన్ లో ఆయన పర్యటించారని గుర్తు చేశారు. రాహుల్ కూడా పొరుగు దేశాలలో పర్యటిస్తూ, కీలక సమస్యలను పరిష్కరించగలిగే సత్తా ఉన్న నేతగా అవతరించాలని సలహా ఇచ్చారు. ఈ విషయంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. 
sudhindra kulkarni
modi
rahul gandhi

More Telugu News