Congress: రాహుల్ గాంధీ... మీరు సంతోషంగా ఉండాలి: బర్త్ డే విషెస్ చెప్పిన నరేంద్ర మోదీ

  • నేడు రాహుల్ గాంధీ 48వ జన్మదినోత్సవం
  • ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
  • రాహుల్ నివాసం వద్ద కాంగ్రెస్ నేతల సందడి
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, నేడు తన 48వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు. రాహుల్ కు దీర్ఘాయువు, ఆరోగ్యకరమైన జీవితం కోసం తాను ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆయన సంతోషంగా ఉండాలని అన్నారు.

 కాగా, నేటి ఉదయం నుంచి న్యూఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాస ప్రాంతం కాంగ్రెస్ కార్యకర్తల సందడితో నిండిపోయింది. తమ అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు నేతలు ఆయన్ను ప్రత్యక్షంగా కలిసేందుకు ఢిల్లీకి చేరుకున్నారు.
Congress
Rahul Gandhi
Narendra Modi
Birthday
Twitter

More Telugu News