american consulate: హైదరాబాదులో అమెరికా కాన్సులేట్ ను ముట్టడించిన వీహెచ్పీ, భజరంగ్ దళ్

  • ఈ రెండు సంస్థలను తీవ్రవాద మత సంస్థలుగా పేర్కొన్న సీఐఏ
  • ఆందోళన చేపట్టిన కార్యకర్తలు
  • కాన్సులేట్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు
హైదరాబాదులోని బేగంపేటలో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు యత్నించారు. ఈ రెండు సంస్థలతో పాటు, మరికొన్ని సంస్థలను అమెరికా గూఢచార సంస్థ సీఐఏ తీవ్రవాద మత సంస్థలుగా పేర్కొంది. ఆరెస్సెస్ ను రాజకీయ ఒత్తిడి బృందంగా అభివర్ణించింది. రాజకీయ పరమైన ఒత్తిడిని కలిగిస్తూ... ఎన్నికల్లో పోటీ చేయని సంస్థలను రాజకీయ ఒత్తిడి బృందాలుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో వీహెచ్పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికన్ కాన్సులేట్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. 
american consulate
hyderabad
vhp
bhajarang dal
protest

More Telugu News