visakhapatnam: పరిశీలించమన్నారు.. పరిశీలిస్తున్నాం!: విశాఖ రైల్వే జోన్ పై రైల్వే మంత్రి కిరికిరి

  • విభజన చట్టంలో ఏముందో ముందు చూడండి
  • విశాఖ జోన్ విషయాన్ని పరిశీలించాలనే ఉంది
  • మేము ఇప్పుడు ఆ పనే చేస్తున్నాం
ఏపీ రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడిన రైల్వే మంత్రి పియూష్ గోయల్ చాలా విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ కోసం డిమాండ్ చేస్తున్నవారు... అసలు విభజన చట్టంలో ఏముందో చూడాలని ఆయన సూచించారు. రైల్వే జోన్ అంశాన్ని పరిశీలించాలని మాత్రమే చట్టంలో ఉందని... తాము ప్రస్తుతం అదే చేస్తున్నామని... ఆ అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇదే విషయాన్ని పార్లమెంటులో కూడా చెప్పామని అన్నారు. పియూష్ గోయల్ తాజా వ్యాఖ్యలతో... విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదనే విషయం స్పష్టమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
visakhapatnam
railway zone
piyush goyal
railway minister

More Telugu News