devegowda: కుమారస్వామి పెద్ద పోరాటమే చేస్తున్నారు: దేవెగౌడ

  • సంకీర్ణ ప్రభుత్వం సంక్లిష్టంగానే ఉంది
  • కుమారస్వామికి అడుగడుగునా కష్టాలే 
  • అయినా ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగుతున్నారు
కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం ఆటుపోటుల మధ్య కొనసాగుతున్నట్టు మాజీ ప్రధాని దేవెగౌడ తెలిపారు. సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంత సులువు కాదని అన్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామికి అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయని... పరీక్షలో పాస్ అయ్యేందుకు కుమారస్వామి పెద్ద పోరాటమే చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అయినా, ధైర్యాన్ని కోల్పోకుండా కుమారస్వామి తన వంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారని చెప్పారు. తుముకూరు జిల్లా పావగడ తాలూకా తాళమరదహళ్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో చర్చనీయాంశంగా మారాయి.
devegowda
kumaraswamy
karnataka
government
problems

More Telugu News