Big Boss: తెలుగు బిగ్ బాస్... కామన్ మ్యాన్ కోటాలో వెళ్లిన సంజన ఎలిమినేషన్!

  • హౌస్ లో ఉన్న వారం రోజుల్లో ఎన్నో వివాదాలు
  • తేజస్వితో నిత్యమూ గొడవ పడ్డ సంజన
  • బయటకు వచ్చిన తరువాత బాబు గోగినేనిపై నిప్పులు
తెలుగు బిగ్ బాస్ రెండో సీజన్ తొలివారంలో సామాన్యుల కోటాలో హోస్ లోకి ఎంట్రీ ఇచ్చి, ఉన్న వారం రోజుల వ్యవధిలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన అన్నే సంజన ఎలిమినేట్ అయింది. మిగతా పోటీదారులతో దూకుడుగా ఉండటం, ముఖ్యంగా తేజస్వితో పలుమార్లు గొడవలు పడటం వంటి కారణాలతో మిగతావారందరికీ దూరమైన ఆమె, హౌస్ నుంచి నిన్న బయటకు వచ్చింది. దీంతో పాటు బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకుల నుంచి సంజనకు అతి తక్కువ ఓట్లు రావడం కూడా ఆమె ఎలిమినేషన్ కు మరో ప్రధాన కారణమైంది.,

ఇక హౌస్ నుంచి బయటకు వచ్చే వేళ బాబు గోగినేని, తేజస్విలపై నిప్పులు చెరిగింది. గోగినేని బయటకు కనిపించేంత మంచి వ్యక్తి ఏమీ కాదని, తేజస్వికి పక్కవారితో ఎలా ఉండాలో తెలియదని వ్యాఖ్యానించింది. ఇక బయటకు వచ్చిన తరువాత తన చేతికి వచ్చిన బిగ్ బాంబ్ ను గోగినేనిపై ప్రయోగించింది. ఇక సంజన స్థానంలో ఓ హీరోయిన్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
Big Boss
Telugu
Tollywood
Sanjana
Elimination
First Week

More Telugu News