Ramcharan: మీరే నా హీరో, నాకు స్ఫూర్తి.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా: రామ్ చరణ్

  • ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ శుభాకాంక్షలు
  • తండ్రితో కలసి ఉన్న ఫొటోను పంచుకున్న చరణ్
  • అందరినీ ఆకట్టుకుంటున్న ట్వీట్
ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి చిరంజీవికి యంగ్ హీరో రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. 'నా మార్గ నిర్దేశకులు, నా హీరో, నాకు స్ఫూర్తి అన్నీ మీరే. హ్యాపీ ఫాదర్స్ డే' అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఇరువురూ కలసి ఉన్న ఫొటోను అప్ లోడ్ చేశాడు. ప్రతి విషయంలో కూడా రామ్ చరణ్ తన తండ్రి సలహాలు, సూచనలు తీసుకుంటారనే విషయం తెలిసిందే. తండ్రి మాటను జవదాటని కొడుకుగా రామ్ చరణ్ కు మంచి పేరు ఉంది.
Ramcharan
Chiranjeevi
fathers day

More Telugu News