Hyderabad: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐదు ఓల్వో బస్సులు, రెండు లారీలు దగ్ధం

  • బహదూర్‌పురలో భారీ అగ్నిప్రమాదం
  • ఒమర్ ట్రావెల్స్ బస్సులు బూడిద
  • కారణాలు తెలుసుకునే పనిలో పోలీసులు
శనివారం రాత్రి బహదూర్‌పురలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఐదు ఓల్వో బస్సులు, రెండు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. బహదూర్‌పురలో ఒమర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు నిలిపేందుకు కొంత పార్కింగ్ స్థలం ఉంది. దీనికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో లారీలను పార్క్ చేస్తారు. సాయంత్రం ఒమర్ ట్రావెల్స్ బస్సు నుంచి పొగలు వచ్చి క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి.

స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చే సరికే మరో నాలుగు బస్సులు, పక్కనే ఉన్న రెండు లారీలకు మంటలు వ్యాపించి పూర్తిగా బూడిద చేశాయి. అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకు రాగలిగారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారణాలు ఆరా తీస్తున్నారు.
Hyderabad
Bahadupura
Fire Accident

More Telugu News