Chandrababu: రేపు ఉదయం మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశం.. పలు రాష్ట్రాల సీఎంలు హాజరు

షార్ట్స్‌లో చూడండి
రేపు ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ పాలకమండలి నాలుగవ సమావేశం ప్రారంభం కానుంది. పలు రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం ముగుస్తుంది. ఇందులో కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు.

ఈ సమావేశానికి హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమన్వయ కర్తగా వ్యవహరించనున్నారు. ప్రధానంగా వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల ఆదాయం రెట్టింపునకు దోహదం చేసే అంశాలపై చర్చిస్తారు. అలాగే, ఈ-నామ్‌, వ్యవసాయ, మార్కెటింగ్‌ సంస్కరణలు, ఉపాధి పథకం, ఆయుష్మాన్‌ భారత్‌తో పాటు పలు పథకాలపై చర్చలు జరుపుతారు. 
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
Narendra Modi

More Telugu News