Virat Kohli: రోడ్డుపై చెత్త పడేసిన యువకుడు.. వెంటనే క్లాస్ పీకిన అనుష్క శర్మ.. వీడియో షేర్‌ చేసిన కోహ్లీ

షార్ట్స్‌లో చూడండి
ముంబయిలో రోడ్డుపై ఖరీదైన కారులో వెళుతూ ఓ యువకుడు చెత్తను నడి రోడ్డుపైనే పడేశాడు. ఆ సమయంలో అదే కారు పక్కనుంచి మరో కారులో వెళుతోన్న బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ ఈ విషయాన్ని గుర్తించి వెంటనే కారులోంచే ఆ యువకుడిని ప్రశ్నించింది. ఇలా ఎందుకు చెత్త రోడ్డుపై పడేశారు? అంటూ నిలదీసింది. దయచేసి చెత్తబుట్టను వాడండని బుద్ధి చెప్పింది.

ఈ ఘటన చోటు చేసుకుంటుండగా వీడియో తీసిన ఆమె భర్త, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో దాన్ని పోస్ట్ చేశాడు. రోడ్డుపై చెత్త పడేసే వారు కనిపిస్తే వారిని ప్రశ్నించండని అన్నాడు. వీరా దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేది? అని కారులోంచి చెత్త పడేసిన వారిని విమర్శించాడు. ఎవరైనా చెత్త పడేయడం చూసినప్పుడు మీరూ ఇలానే చేయండని సూచించాడు.
Go Back to Shorts
Virat Kohli
Viral Videos

More Telugu News