shivaswamy: రమణ దీక్షితులుపై కేసు నమోదు చేయాలని యోచిస్తుండడం దారుణం: శివస్వామి

  • దేవాలయాలను రాజకీయ పునరావాసాలుగా మార్చుతున్నారు 
  • ప్రభుత్వం హిందువుల స్వేచ్ఛను హరిస్తోంది
  • హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్నారు
హిందూ ధర్మాన్ని కాపాడతామని ఎవరు తమ మ్యానిఫెస్టోలో పెడితే వారికే తాము 2019 ఎన్నికల్లో మద్దతు ఇస్తామని శైవ క్షేత్రం పీఠాధిపతి శ్రీ శివస్వామి అన్నారు. దేవాలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చుతున్నారని, ప్రభుత్వం హిందువుల స్వేచ్ఛను హరిస్తోందని విమర్శించారు. హిందూ దేవాలయాలను కూల్చివేయడమే కాకుండా, హిందూ ధర్మం గురించి మాట్లాడితే వారిని లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

దేవాలయాల ఆదాయాన్ని వాటి అభివృద్ధికి కాకుండా ఇతర కార్యక్రమాలకు వాడుకోవటం దారుణమని శివస్వామి అన్నారు. టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులుపై కేసులు నమోదు చేయాలని సర్కారు యోచిస్తుండడం దారుణమని వ్యాఖ్యానించారు.
shivaswamy
Telugudesam
Andhra Pradesh

More Telugu News