mamatha: మమతా బెనర్జీతో చంద్రబాబు భేటీ.. కాసేపట్లో కేజ్రీవాల్‌ వద్దకు!

  • రేపు నీతి ఆయోగ్‌ సమావేశం
  • ఢిల్లీలో చంద్రబాబు
  • మమతా, కుమారస్వామిలతో కలిసి ఢిల్లీ సీఎం వద్దకు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కొద్ది సేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. రేపు జరగనున్న నీతి ఆయోగ్‌ సమావేశంలో ఏపీ సీఎం పాల్గొననున్నారు. ప్రస్తుతం ఢిల్లీ ఏపీ భవన్‌లో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చంద్రబాబు నాయుడు భేటీ అయి పలు అంశాలపై చర్చిస్తున్నారు.

 కాసేపట్లో మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామిలతో కలిసి చంద్రబాబు నాయుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వద్దకు వెళ్లనున్నారు. కేజ్రీవాల్‌ ప్రస్తుతం తమ లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తీరుకి నిరసన ధర్నాలో పాల్గొంటోన్న విషయం తెలిసిందే. ఆయనకు సదరు ముఖ్యమంత్రులు సంఘీభావం తెలపనున్నారు.
mamatha
Chandrababu
Karnataka
New Delhi

More Telugu News