lagadapati: ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే?.. కాసేపట్లో లగడపాటి ఆర్‌జీ ఫ్లాష్ టీమ్ సర్వే వివరాలు

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ‌్రప్రదేశ్‌లో తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, నాలుగేళ్ల చంద్రబాబు నాయుడి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? లేక అసంతృప్తితో వేరే పార్టీకి అధికారం కట్టుబెడతారా? అనే విషయంపై లగడపాటి ఆర్‌జీ ఫ్లాష్ టీమ్ సర్వే చేసిందని ప్రముఖ తెలుగు మీడియా 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' పేర్కొంది. గతంలో లగడపాటి చేసిన పలు సర్వేలు నిజమైన విషయం తెలిసిందే.

‘ఏపీ పల్స్’ పేరిట ఈరోజు రాత్రి 7 గంటల నుంచి ఈ వివరాలు ప్రసారం చేస్తామని తెలిపింది. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించుకోవడం వంటి ఎన్నో పోరాటాలు జరుగుతోన్న ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి జనం జై కొడతారనే విషయాన్ని తెలపనున్నట్లు పేర్కొంది.   
Go Back to Shorts
lagadapati
Andhra Pradesh

More Telugu News