New Delhi: ఢిల్లీ బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరారు. ఆయనతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు. రేపు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర సమస్యలపై 24 పేజీల నివేదికను చంద్రబాబు సిద్ధం చేసుకుని వెళ్లారు. ఇప్పటికే నీతి ఆయోగ్‌ సమావేశం గురించి ఆయన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన విషయం తెలిసిందే.

జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు జరుగుతోన్న అన్యాయంపై కూడా నిలదీయాలని చంద్రబాబు భావిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘ విధి విధానాల సవరణలపై ఆయన అభ్యంతరాలు తెలపనున్నారు. ఒకవేళ ఈ సమావేశంలో రాష్ట్ర సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే నిరసన తెలపాలని ఆయన భావిస్తున్నారు.
Go Back to Shorts
New Delhi
Chandrababu
Andhra Pradesh

More Telugu News