మెగా హీరోలతో పాటు రంగంలోకి దిగుతున్న గోపీచంద్!
- వచ్చేనెల 6వ తేదీన 'తేజ్ ఐ లవ్ యూ'
- అదే రోజున థియేటర్లకు 'విజేత'
- 'పంతం' కూడా ఆ రోజునే రిలీజ్
అయినా తేజు .. కల్యాణ్ దేవ్ సినిమాలు ఒకే రోజున వస్తుండటం విశేషం. ఇదే రోజున రావడానికి గోపీచంద్ కూడా రెడీ అవుతున్నాడు. గోపీచంద్ హీరోగా .. ఆయన 25వ సినిమాగా చక్రి దర్శకత్వంలో 'పంతం' సినిమా రూపొందింది. ఈ సినిమాను కూడా వచ్చేనెల 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూడు సినిమాలు కూడా కంటెంట్ పరంగా పూర్తిగా వైవిధ్యభరితమైనవి కావడం వలన పోటీ ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.