eiffel tower: ఈఫిల్ ట‌వ‌ర్ చుట్టూ భారీ ఫెన్సింగ్.. ఇదిగో వీడియో!

  • సుమారు 40 మిలియన్ డాలర్ల ఖర్చుతో కట్టుదిట్టమైన ఫెన్సింగ్
  • దేశంలో ఉన్న అన్ని పురాతన కట్టడాల చుట్టూ భద్రత
  • టవర్‌ కి రెండు వైపులా గ్లాస్ గోడలు, మరో రెండు వైపులా మెటల్ ఫెన్సింగ్‌
ప్రపంచంలో ప్రసిద్దిగాంచిన ఈఫిల్ టవర్ చుట్టూ కొత్త ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. టవర్ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 40 మిలియన్ డాలర్ల ఖర్చుతో కట్టుదిట్టమైన ఫెన్సింగ్ ను నిర్మిస్తున్నామని ఆ దేశ అధికారులు తెలిపారు.

2015 నుంచి ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 240 మందికి పైగా చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల దాడుల నుంచి కాపాడుకునేందుకు ఆ దేశంలో ఉన్న అన్ని పురాతన కట్టడాల చుట్టూ భద్రతను పెంచుతున్నారు. కాగా ఈఫిల్ టవర్‌ కి రెండు వైపులా గ్లాస్ గోడలను, మరో రెండు వైపులా మెటల్ ఫెన్సింగ్‌ ను ఏర్పాటు చేశారు.
eiffel tower
france
international

More Telugu News