trisha: త్రిష నాయికగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో సినిమా!

  • తెలుగులో అవకాశాలు లేని త్రిష 
  • తమిళంలో అడపా దడపా ఛాన్సులు 
  • త్వరలో తెలుగులోకి రీ ఎంట్రీ
తెలుగులో అగ్రకథానాయికగా త్రిష ఒక వెలుగు వెలిగింది. తమిళంలోను ఆమె స్టార్ హీరోలతో కలిసి అనేక విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అలాంటి త్రిషకి తెలుగులో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. తమిళంలో మాత్రం కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తూ కెరియర్ ను నెట్టుకొస్తోంది. తెలుగు తెరకి చాలాకాలంగా దూరంగా ఉంటూ వస్తోన్న త్రిష .. త్వరలో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  'శతమానం భవతి' సినిమాతో విజయాన్ని అందుకున్న సతీశ్ వేగేశ్న తాజాగా నితిన్ హీరోగా 'శ్రీనివాస కల్యాణం' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు తరువాత ఆయన కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమా చేయనున్నాడట. ఆ సినిమా కోసమే ఆయన త్రిషను సంప్రదించడం .. కథ తన పాత్ర చుట్టూనే తిరిగేది కావడంతో ఆమె ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎల్.నారాయణ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడని చెబుతున్నారు.  
trisha
sathish vegeshna

More Telugu News