యూత్ ను ఆకట్టుకునేలా 'లవర్' నుంచి మోషన్ పోస్టర్
- దిల్ రాజు నిర్మాతగా 'లవర్'
- దర్శకుడిగా అనీశ్ కృష్ణ
- రాజ్ తరుణ్ జోడీగా రిద్ధి కుమార్
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టులుక్ గా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఓ కొండ చివర కూర్చుని హీరో ఏదో ఆలోచన చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ వుంది. సాయికార్తీక్ అందించిన మ్యూజిక్ బిట్ తో కలిపి అందించిన ఈ మోషన్ పోస్టర్ యూత్ ను ఆకట్టుకునేదిలానే వుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజుకి యూత్ పల్స్ తెలుసుకనుక, వాళ్ల నుంచి ఈ సినిమా మంచి మార్కులు కొట్టేస్తుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.