t-Telugudesam: అప్పటి నుంచే మోత్కుపల్లిని ఏ కార్యక్రమాలకు పిలవలేదు: టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ

  • ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి పిలిస్తే మోత్కుపల్లి  రాలేదు
  • అప్పటి నుంచే ఏ కార్యక్రమాలకు ఆయన్ని ఆహ్వానించలేదు
  • తల్లిలాంటి టీడీపీకి మోత్కుపల్లి ద్రోహం చేస్తున్నారు
ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి పిలిస్తే మోత్కుపల్లి నర్సింహులు రాలేదని, అప్పటి నుంచే ఏ కార్యక్రమాలకు ఆయన్ని ఆహ్వానించలేదని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. సీఎం చంద్రబాబుపై మోత్కుపల్లి నిన్న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రమణ స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నో అవకాశాలు ఇచ్చి ఆదరించిన తల్లిలాంటి టీడీపీకి మోత్కుపల్లి ద్రోహం చేస్తున్నారని ఆగ్రహించారు. ‘పెడితే పెళ్లికి.. లేకపోతే చావుకు’ అన్నట్టు ఆయన వ్యవహరిస్తున్నారని, వ్యక్తులను చూసి భయపడే పార్టీ టీడీపీ కాదని రమణ స్పష్టం చేశారు.
t-Telugudesam
mothkpalli
L.Ramana

More Telugu News