Arvind Kejriwal: కేజ్రీవాల్‌ ధర్నా భగ్నానికి రంగం సిద్ధం!

  • లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో నిరసన దీక్ష
  • కార్యాలయానికి చేరుకున్న అంబులెన్స్‌లు 
  • ఏ క్షణంలోనైనా ఆసుపత్రికి తరలించే అవకాశం
ఢిల్లీలో ఐఏఎస్‌ అధికారులు చేస్తోన్న ఆందోళనను విరమింపజేసేలా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ చొరవ తీసుకోవాలని, అలాగే పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తమ రాష్ట్ర మంత్రులతో కలిసి నిరసన చేస్తోన్న విషయం తెలిసిందే. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో చేస్తోన్న ఆయన నిరసన ధర్నా ఐదో రోజుకి చేరింది.

ఈ క్రమంలో కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఎవరినీ అనుమతించట్లేదు. 4 నెలలుగా ఢిల్లీ రాష్ట్ర ఐఏఎస్‌లు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రధాని మోదీ జోక్యం చేసుకోవట్లేదని కేజ్రీవాల్‌ మండిపడుతున్నారు. కాగా, ఆప్‌ మంత్రుల దీక్షను భగ్నం చేసేందుకు రంగం సిద్ధమైంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయానికి అంబులెన్స్‌లు చేరుకున్నాయి. ఏ క్షణంలోనైనా ఆప్‌ మంత్రులను ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. 
Arvind Kejriwal
New Delhi
protest

More Telugu News