rajani: మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్?

  • విజయ్ మూవీతో బిజీగా మురుగదాస్ 
  • నెక్స్ట్ మూవీ రజనీతో చేయాలనే ఆలోచన 
  • ఆ దిశగా జరుగుతోన్న ప్రయత్నాలు
తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో దర్శకుడిగా మురుగదాస్ కి మంచి క్రేజ్ వుంది. కథా కథనాలను పట్టుగా సిద్ధం చేసుకోవడంలోను .. తెరపై వాటిని ఆసక్తికరంగా ఆవిష్కరించడంలోను మురుగదాస్ సిద్ధహస్తుడు. అందువలన ఆయన అడగాలేగాని డేట్స్ ఇవ్వని కథానాయకులు అంటూ వుండరు. ఈ కారణంగానే 'స్పైడర్' సినిమా పరాజయంపాలైనా ఆ తరువాత సినిమాను ఆయన విజయ్ తో చేయగలుగుతున్నాడు.గతంలో విజయ్ తో మూగదాస్ చేసిన 'కత్తి' .. 'తుపాకి' హిట్ కొట్టడం వలన, ఆయన అభిమానులంతా ఇప్పుడు ఈ సినిమాను గురించే ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను రజనీకాంత్ తో ఒక సినిమా చేసే ఆలోచనలో వున్నట్టుగా మురుగదాస్ చెప్పాడు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నాడు. మురుగదాస్ అడిగితే రజనీ కాదనకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందువలన ఈ కాంబినేషన్ సెట్టయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.   
rajani
murugadoss

More Telugu News