priyanka chopra: ప్రియాంకాచోప్రా రెమ్యునరేషన్..... రూ. 12 కోట్లు!

  • 'భరత్' చిత్రంలో సల్మాన్ సరసన నటించనున్న ప్రియాంక
  • రూ. 12 కోట్ల పారితోషికానికి ఓకే చెప్పిన క్వాంటికో భామ
  • 2019 రంజాన్ కు సినిమా విడుదల
హీరో, హీరోయిన్లు ఒక సినిమా కోసం సమానంగా కష్టపడుతున్నప్పుడు... ఇద్దరి మధ్య రెమ్యునరేషన్ లో తేడా ఎందుకనే చర్చ బీటౌన్ లో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ భామలు హాలీవుడ్ లో కూడా అడుగుపెట్టారు. దీంతో, బాలీవుడ్ లో కూడా భారీ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా సల్మాన్ ఖాన్ చిత్రం 'భరత్' కోసం ప్రియాంకాచోప్రా ఏకంగా రూ. 12 కోట్లు అందుకోబోతోందట. నిర్మాతలు ఆమెను సంప్రదించగానే రూ. 14 కోట్లు డిమాండ్ చేసిందట. అయితే, 'పద్మావత్' సినిమాలో దీపికా పదుకునేకు రూ. 12 కోట్లు పారితోషికం ఇచ్చారని, తాము కూడా అంతే ఇస్తామని నిర్మాతలు చెప్పడంతో, దానికి ప్రియాంక అంగీకరించిందట. ఈ చిత్రం 2019 రంజాన్ కు విడుదల కానుంది. దక్షిణకొరియా చిత్రం 'ఓడ్ టు మై ఫాదర్' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. 
priyanka chopra
remuneration
bollywood
bharat movie
Salman Khan

More Telugu News