Telugudesam: రూ. 30 వేల కోట్లు దోచేస్తున్న చంద్రబాబు: సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

  • సంక్షేమ నిధులను ఆదాయ వనరుగా మార్చుకున్నారు
  • గృహ నిర్మాణంలో రూ. 30 వేల కోట్ల అవినీతి
  • ఉపాధి హామీ పథకంలో రూ. 13 వేల కోట్ల దోపిడీ
  • బీజేపీ నేత సోము వీర్రాజు నిప్పులు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రజా సంక్షేమం నిమిత్తం పలు పథకాల కోసం వేల కోట్ల రూపాయలను రాష్ట్రానికి నిధుల రూపంలో ఇస్తుంటే, వాటిని చంద్రబాబు తన ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ఈ ఉదయం రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన, గృహ నిర్మాణ పథకాల నిమిత్తం కేంద్రం ఇచ్చిన నిధుల్లో రూ. 30 వేల కోట్లను చంద్రబాబు దోచేస్తున్నారని అన్నారు. ఇక టీడీపీ కార్యకర్తలకు 'నీరు-చెట్టు' పథకం ఉపాధిని కల్పిస్తోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం కోసం కేంద్రం ఇచ్చిన నిధుల్లో రూ. 13 వేల కోట్లను దోచుకున్నారని నిప్పులు చెరిగిన సోము వీర్రాజు, మొత్తం అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకు, చంద్రబాబుకు అసలు సంబంధమే లేదని వ్యాఖ్యానించారు.
Telugudesam
BJP
Somu Veerraju
Chandrababu

More Telugu News