తాజ్ మహల్ ను దత్తత ఇవ్వాలన్న ఆలోచనపై కేంద్రం వెనుకడుగు!
- ఇప్పటికిప్పుడు దత్తత అవసరం లేదని కమిటీ భావన
- పరిష్కరించాల్సిన అంశాలున్నాయని ఓ అధికారి వెల్లడి
- కట్టడం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు
తాజ్ మహల్ దత్తత అంశంపై తాము దృష్టి పెట్టలేదని, తాజ్ మహల్ సహా కొన్ని ఇప్పటికిప్పుడు దత్తతకు ఇవ్వాల్సిన అవసరం లేదని దత్తత కోసం ఏర్పాటైన కమిటీ తేల్చేసింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ వారసత్వ సంపదలో భాగమైన తాజ్ మహల్ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోవడంపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఈ ఏడాది మే నెలలో సుప్రీంకోర్టు తలంటిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పలు అంశాలను పరిష్కరించాల్సి ఉందని ఓ అధికారి పేర్కొన్నారు.