jagan: రాక్షస సైన్యానికి శుక్రాచార్యుడు విజయసాయిరెడ్డి: డొక్కా

  • జగన్ కేసులు ఎత్తి వేసేందుకు బీజేపీ హామీ ఇచ్చింది
  • అందుకే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేశారు
  • ఏపీ భవన్ సాక్షిగా కుట్రలు జరుగుతున్నాయి
ఏపీ అభివృద్ధికి వైసీపీ, బీజేపీలు అడ్డంకిగా మారాయని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. టీడీపీని అణగదొక్కాలనే లక్ష్యంతో ఇరు పార్టీలు కలసి కుట్రలకు పాల్పడుతున్నాయని అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ సాక్షిగా ఈ కుట్రలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. కర్ణాటకలో బీజేపీ తరపున వైసీపీ ప్రచారం చేయడం దీనికి ఒక ఉదాహరణ అని అన్నారు. జగన్ పై ఉన్న కేసులను ఎత్తి వేసేందుకు బీజేపీ హామీ ఇచ్చిందని... అందుకే బీజేపీ తరపున వైసీపీ ప్రచారం చేసిందని విమర్శించారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాక్షస సైన్యానికి శుక్రాచార్యుడిలా అవతరించారని డొక్కా అన్నారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి కేంద్రం చేసిన మంచి పని ఒక్కటి కూడా లేదని మండిపడ్డారు. కడపకు ఉక్కు పరిశ్రమను ఇవ్వలేమని కేంద్రం చెప్పినా... జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. బీజేపీ కుట్రలను దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తామని తెలిపారు. 
jagan
bjp
YSRCP
vijaysai reddy
dokka

More Telugu News