Solar Energy: భారత సోలార్ ప్లాంటులో సాఫ్ట్ బ్యాంక్ రూ. 4 లక్షల కోట్లు పెట్టుబడి... అతి త్వరలో కేంద్రం ప్రకటన!

  • భారత సౌర విద్యుత్ రంగంలో భారీ పెట్టుబడి
  • 60 నుంచి 100 బిలియన్ డాలర్లు పెట్టనున్న సాఫ్ట్ బ్యాంక్
  • కలిసిరానున్న సౌదీ అరేబియా
జపాన్ కేంద్రంగా నడుస్తున్న సాఫ్ట్ బ్యాంక్, భారత సౌర విద్యుత్ రంగంలో భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సాఫ్ట్ బ్యాంక్ తుది దశ చర్చలు సాగిస్తోందని, ఈ పెట్టుబడిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని జపాన్ ప్రభుత్వ న్యూస్ ఏజన్సీ 'ఎన్ హెచ్ కే' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సౌదీ అరేబియా కూడా ఇందులో భాగస్వామ్యం కానుందని, 60 నుంచి 100 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 4 లక్షల కోట్ల నుంచి రూ. 6.6లక్షల కోట్ల మధ్య) ఇండియాలో సోలార్ ప్లాంట్ల నిర్మాణం, విస్తరణ, అభివృద్ధికి వెచ్చించనున్నట్టు తెలిపింది. కాగా, ఈ విషయంలో సాఫ్ట్ బ్యాంక్ ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఏ అధికారీ అందుబాటులో లేరు. ఇటీవలే ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ ప్లాంటును సౌదీ అరేబియాలో నెలకొల్పేలా తాము నిర్వహిస్తున్న విజన్ ఫండ్ పెట్టుబడులు పెట్టనున్నట్టు సాఫ్ట్ బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Solar Energy
Soft Bank
Japan
India
Investment

More Telugu News