ntr: 'అరవింద సమేత వీర రాఘవ' రిలీజ్ డేట్ ఖరారైనట్టే

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 
  • ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథ 
  • హీరోయిన్స్ గా పూజా హెగ్డే .. ఈషా రెబ్బా
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. భారీ బడ్జెట్ తో చినబాబు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికలుగా పూజా హెగ్డే .. ఈషా రెబ్బా నటిస్తున్నారు. ఈ సినిమాను దసరాకి విడుదల చేయనున్నట్టుగా ముందుగానే చెప్పారు. ఈ క్రమంలో అక్టోబర్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శకనిర్మాతలు వచ్చారనేది తాజా సమాచారం.

సాధారణంగా గురు .. శుక్రవారాల్లో సినిమాలు విడుదల చేస్తుంటారు. అక్టోబర్ 10వ తేదీన బుధవారం అయినప్పటికీ విడుదల చేయాలనే భావిస్తున్నారట. మరో రెండు మూడు రోజుల్లో ఎన్టీఆర్ షూటింగుకి హాజరవుతాడు. అప్పుడు ఆయనకి ఒక మాట చెప్పేసి  .. అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ఫ్యాక్షన్ నేపథ్యం .. ఎన్టీఆర్ లుక్ .. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. మొత్తానికి ఈ దసరాకి ఎన్టీఆర్ ఒక రేంజ్ లో సందడి చేయనున్నాడన్న మాట.    
ntr
pooja hegde
eesha rebba

More Telugu News