చిరంజీవి యువతకు నరసింహన్ చేతుల మీదుగా అవార్డు!
- అందుకున్న చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు
- రాజ్‌భవన్ లో కార్యక్రమం
- అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన స్వామినాయుడు
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడుకి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ సందర్భంగా ఓ అవార్డును ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ లో ఈ అవార్డు అందుకున్న తరువాత స్వామినాయుడు మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడానికి కారకులైన తెలుగు రాష్ట్రాలలో ఉన్న మెగా అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు
తెలియజేస్తున్నామని అన్నారు.