CM Ramesh: ఈ నెలాఖరులో నా ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం.. వైసీపీ మద్దతివ్వాలి: సీఎం రమేష్

  • జగన్‌ పాదయాత్ర ఆపాలి
  • కడప జిల్లాకు జరుగుతోన్న అన్యాయంపై పోరాడాలి
  • కడపకు ఉక్కు కర్మాగారం కీలకమైంది
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన కడప జిల్లాలో ఇదే విషయంపై మీడియాతో మాట్లాడుతూ... తన ఆమరణ దీక్ష ఈనెల చివరి నుంచి ప్రారంభిస్తానని చెప్పారు. తన దీక్షకు వైసీపీ మద్దతివ్వాలని, అలాగే జగన్‌ పాదయాత్ర ఆపి కడప జిల్లాకు జరుగుతోన్న అన్యాయంపై పోరాడాలని డిమాండ్‌ చేశారు.

విభజన హామీల్లో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం కీలకమైందని, అది రావాల్సిందేనని సీఎం రమేష్‌ అన్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఆ పరిశ్రమ కోసం భూమి, నీటి సౌకర్యం, ఈక్విటీ షేర్‌కు అంగీకారం తెలిపారని అన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకుండా కేంద్ర సర్కారు నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని అన్నారు.
CM Ramesh
Kadapa District

More Telugu News