steel: ఏపీ, తెలంగాణల్లో ఉక్కు పరిశ్రమలపై కేంద్ర ప్రభుత్వ కీలక ప్రకటన

  • ఏర్పాటు సాధ్యాసాధ్యాలను టాస్క్‌ఫోర్స్‌ పరిశీలిస్తోందన్న కేంద్రం
  • నిన్న సుప్రీంకోర్టులో అఫిడవిట్‌
  • కడపలో ఉక్కు పరిశ్రమపై ఏర్పాటుపై డిమాండ్‌లు
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా, తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు పరిశ్రమల ఏర్పాటు విషయమై నిన్న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫడవిట్ ను సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు దీనిపై కేంద్ర సర్కారు ఓ ప్రకటన విడుదల చేసింది. ఏపీ, తెలంగాణల్లోని ఆయా ప్రాంతాల్లో ఉక్కు పరిశ్రమల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను టాస్క్‌ఫోర్స్‌ పరిశీలిస్తోందని పేర్కొంది.

మరోవైపు, కడపకు ఉక్కు పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వ తీరుపై టీడీపీ, కాంగ్రెస్‌లు మండిపడుతూ నిరసనలు తెలపడానికి సిద్ధమవుతున్నాయి. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కేంద్ర సర్కారు నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నాయి.
steel
Kadapa District
Telangana

More Telugu News