sensex: అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయంతో.. బేర్ మన్న మార్కెట్లు

  • 139 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • ఒకానొక సమయంలో 200 పాయింట్లకు పైగా పతనం
  • 10,808 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ
ఫెడరల్ ఫండ్స్ రేటును పావు శాతం పెంచుతూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయంతో... అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అయ్యాయి. దీని ప్రభావంతో భారతీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. ఒకానొక సమయంలో 200 పాయింట్లకు పైగా దిగజారిన సెన్సెక్స్... ట్రేడింగ్ ముగిసే సమయానికి 139 పాయింట్ల నష్టంతో 35,560కు పడిపోయింది. నిఫ్టీ 49 పాయింట్లు కోల్పోయి 10,808 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎంఎంటీసీ లిమిటెడ్ (6.11%), వక్రాంగీ లిమిటెడ్ (4.96%), క్వాలిటీ (4.90%), జై ప్రకాశ్ అసోసియేట్స్ (4.51%), హెక్సావేర్ టెక్నాలజీస్ (4.48%).

టాప్ లూజర్స్:
ఒబెరాయ్ రియాల్టీ (4.08%), మైండ్ ట్రీ లిమిటెడ్ (3.52%), ఇండియా సిమెంట్స్ (3.12%), శ్రీ రేణుకా షుగర్స్ (3.11%), కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (2.88%).    
sensex
nifty
stock market

More Telugu News