Police: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పదే పదే చేస్తే రౌడీషీట్లు: రామగుండం పోలీస్‌ కమీషనర్‌

  • పోలీసు అధికారులతో సమీక్ష
  • పలు సూచనలు చేసిన పోలీస్‌ కమీషనర్‌
  • ఫిర్యాదులు అందిస్తోన్న ప్రజల పట్ల మర్యాద పూర్వకంగా ఉండాలి
సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకోవాలని, ఒకవేళ సదరు వ్యక్తులు పదేపదే అటువంటి పోస్టులే చేస్తుంటే రౌడీషీట్లు తెరవాలని మంచిర్యాల జిల్లాలోని రామగుండం పోలీస్‌ కమీషనర్‌ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ ఆదేశించారు. ఈరోజు సీసీసీలోని సింగరేణి గెస్ట్‌హస్‌ కాన్ఫరెన్సు హాల్‌లో తమ పరిధిలోని పోలీసు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.

అలాగే, నేరాల నియంత్రణకు టెక్నాలజీని వాడుకోవాలని, నేరాలు తగ్గించే దిశగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, జనమైత్రి, పోలీస్‌మిత్ర వంటి కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. అలాగే, ఫిర్యాదులు అందిస్తోన్న ప్రజల పట్ల మర్యాద పూర్వకంగా ఉండాలని అన్నారు.
Police
Mancherial District
Twitter

More Telugu News