జగన్..‘పోలవరం’ డ్యామ్ సైట్ చూసి మాట్లాడాలి: మంత్రి దేవినేని

పోలవరం ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్న వైసీపీ అధినేత జగన్ కు ఏపీ మంత్రి దేవినేని ఉమ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ,  414 రోజులు కష్టపడి డయాఫ్రం వాల్ ను ఓ యజ్ఞంలా పూర్తి చేశామని అన్నారు. ‘పోలవరం’ ప్రాజెక్టును సినిమా అంటూ జగన్ బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘పోలవరం’ పనులను విమర్శిస్తున్న జగన్.. డ్యామ్ సైట్ చూసి మాట్లాడాలని, ఆంధ్రుల రాజధానిని భ్రమరావతి అంటూ హేళన చేయడం తగదని జగన్ కు దేవినేని హితవు పలికారు.  


More Telugu News