Kesineni Nani: కన్నా, జీవీఎల్ చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని తేలింది: కేశినేని నాని

  • ఉక్కు పరిశ్రమ విషయమై కేంద్రం మరోసారి మోసం చేసింది
  • కేంద్రం తన దుర్బుద్ధిని చూపించింది
  • తాము నిర్వహించే దీక్షల్లో  వైసీపీ ఎంపీలూ పాల్గొనాలి
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు ఏపీపై ఎంతో ప్రేమ ఉందని కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు చెబుతున్న మాటలు  పచ్చి అబద్ధాలని తేలాయని టీడీపీ ఎంపీ కేశినేని అన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి కేంద్రం మరోసారి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కడపలో ఉక్కు ఫ్యాకర్టీ ఏర్పాటు విషయమై మెకాన్ సర్వేలో సానుకూలత వ్యక్తమైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతించమని చెప్పిన కేంద్రం తన దుర్బుద్ధిని చూపించిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోరుతూ నిర్వహించే దీక్షల్లో టీడీపీ ఎంపీలతో వైసీపీ ఎంపీలు కూడా పాల్గొనాలని కేశినేని కోరారు.
Kesineni Nani
kanna

More Telugu News